getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
మా గురించి

సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించటం, నైతిక విలువలు, సనాతన ధర్మాన్ని పరిరక్షించటం, తదితర ఉన్నత ఆశయాలతో.......,

మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ, పెద్దల ఆశీర్బలం, మిత్రుల ప్రోత్సాహం, ప్రజల నుంచి మంచి స్పందనాలతో, ఆత్మవిశ్వాసంతో, అందరిని కలుపుకుంటూ, అందరూ ఆమోదించే విధంగా,కుటుంబవృద్ధి తద్వారా సమాజ వృద్ధికై మన ఇళ్లల్లోనూ, ఇతర సామూహిక పుణ్య స్థలములలోను జరుగు పూజలకు, శుభకార్యాలకు అనుకూలమైన స్మార్త, వేద పురోహితులను ఒకచ్చోట చేర్చుటకు ఒక విరాట్ ప్రయత్నం చేయుటకు ఒక ధృడ సంకల్పంతో, ఒక కొండను అద్దంలో చూపించే ప్రయత్నం అయినా, చంద్రునికో నూలుపోగులా ఒక టీం గా ఐదుగురం కల్సి చేస్తున్న మా తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని, ఈ సైటును ఉపయోగిస్తూ, అందరికి తెలియచేస్తారని భావిస్తూ...

ఈ సైట్ ప్రాముఖ్యత గురించి క్లుప్త పరిచయ వాక్యాలుగా, సప్తపది, సప్తర్షులుగా ( ఆరున్నకటిగా 1 + 6 ) సౌలభ్యం కోసం విభజించి, ఆయా భాగాలకు సమయోచిత నామములతో పేర్కొవటం జరిగింది. పురాణేతిహాసాలు, దర్శనాలు, పుణ్యతీర్ధాలు, దేవాలయాలు, తపోవనాలు, పుణ్యనదులు, పర్వతాలు, సాగరాలు, ఇలా అనేక విషయాలతో వున్న వాటిని .......

 • గుడి ముందు ముగ్గులా మొదటిది ఇప్పుడు మీరు చదువుతున్న విషయాలతో కూడిన మా వినయ వాక్కులు మా గురించి.
 • పూజారి శోధన:- ఈ విభాగంలో మనం చేసుకునే సమస్త పూజా, శుభ,అశుభ కార్యక్రమాలకు మనకు దగ్గరలో ఉన్న పూజారులు -- పండితులు ఎవరు అనేది తెలుసుకోవచ్చు. దీనిలో వారి ఫొటోతో వారు చేయు కార్యక్రమములు, వారి పూర్తి వివరములు పొందుపరచటం జరిగింది.
 • ఆధ్యాత్మిక కార్యక్రమాలు :- ఈ విభాగము నందు మాకు తెలిసిన దేవాలయములలో కానీ, మరి ఏ ఇతర పుణ్యస్థలములలో కానీ జరిగే సామూహిక పూజలు,ఉపనయనాలు, వివాహాలు ,ఆధ్యాత్మిక ప్రవచనాలు మొదలగునవి జరుగుచున్నప్పుడు సమాచారము అందచేయుట. అదేవిధంగా మీరు తెలిపినా వాటిని కూడా పొందుపరచటం.
 • పూజాసామాగ్రి :- ఈ విభాగంలో మనం చేసుకోదలచిన శుభకార్యములుకు సహాయకులు లేకనో, పని బాధ్యతలతో విరామం లేకనో అవి మరుగున పడటం జరుగుతుంది. అటువంటి ఇబ్బందులు పడకుండా ఈ విభాగంలో ఏఏ పూజలు, వాటికి కావాల్సిన పూజాసామాగ్రి, ఆ పూజలు చేయు పురోహితులతో మేము వచ్చి చేయించు ఏర్పాటు. ఆయా పూజలకు అయ్యే ఖర్చు ( బ్రహ్మ గారి దక్షిణతో కల్పి ) పొందుపరచటం జరిగింది. చేయించుకోదలచినవారు 3 రోజుల ముందుగా తెలియపరచటం అనుకూలంగా ఉంటుంది.
 • విజ్ఞాన భాండము:- ఈ విభాగంలో సంస్కృతి, సంస్కారం, సంస్కరణం అనే మూడు పాయల త్రివేణి సంగమ గంగా ప్రవాహముగా, తెలిసిన విజ్ఞాన విషయములు నలుగురికి పంచుట, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక సృజనాత్మకతను అందరికి వెల్లడి చేయుట, కధలు, కవితలు మొదలగు విజ్ఞాన దాయకమైనవి పొందుపరచటం జరిగింది.
 • సేవలు :- దీనిలో మరలా 5 భాగాలు చేయటం జరిగింది.
  1. మన దేవాలయాలు:- ముఖ్యమైన దేవాలయాలు, అచ్చటి సందర్శనా స్థలములు వివరణ.
  2. ఆపాతమధురాలు:-దీనిలో మనము జరుపుకొను శుభకార్యములలోగాని, ఇతర సమాయాలలోగాని మన అమ్మలు, అమ్ముమ్మలు మంగళహారతులు, పెండ్లిపాటలు, భక్తిపాటలు, జానపదగేయాలు మొదలైనవి పాడుతూవుంటారు. అవి రానురాను మరుగున పడుతున్నాయి. భావితరాలకు అవి ఒక సంపదగా అందచేయాలనే తలంపుతో వారు పాడినవి సెల్ లో ఆడియో రికార్డుతో, అదేపాటను పి.డి.ఏఫ్ లో పంపిస్తే అవి ఇక్కడపొందుపర్చటం జరుగుతుంది.
  3. ఆరోగ్యచిట్కాలు
  4. ఆధ్యాత్మిక పుస్తకముల వివరములు
  5. మన పద్యాలు.
 • సంప్రదించండి:- దినిలొ మి యొక్క భావనలు, సూచనలు తెలియచేయవచ్చు మరియు పూజ సామగ్రి, పూజారుల వివరాలు తెలుసుకొవచ్చు.

అనేక ధన్యవాదములతో...మీ getapujari.com టీంసూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న, మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner